ఎంసెట్పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ | Telangana to ask Supreme Court: extend admission dates | Sakshi
Sakshi News home page

ఎంసెట్పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

Jul 14 2014 2:13 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఎంసెట్పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ - Sakshi

ఎంసెట్పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎంసెట్ కౌన్సెలింగ్కు మరింత గడువు కావాలంటూ ప్రభుత్వం న్యాయస్థానంలో సోమవారం పిల్ దాఖలు చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎంసెట్ కౌన్సెలింగ్కు మరింత గడువు కావాలంటూ ప్రభుత్వం న్యాయస్థానంలో సోమవారం పిల్ దాఖలు చేసింది. మరోవైపు స్థానికత అంశంపై ఎటూ తేలకపోవడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానికతపై నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement