తెలంగాణలో పోలీస్ శాఖ అప్రమత్తం

Telangana Police Department Is On Alert In Wake Of Corona Outbreak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్‌లను డిస్‌ ఇన్ఫెక్షన్‌ టీమ్‌లు శుభ్రం చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్‌లను శుద్ధి చేయనున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో పల్స్‌ ఆక్సీమిషన్స్‌ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top