పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్ | Telangana Legislative Council Chairman Swamy Goud distributes Land documents | Sakshi
Sakshi News home page

పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్

Jun 9 2015 3:54 PM | Updated on Mar 28 2018 11:08 AM

పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్ - Sakshi

పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అర్హులైన పేదలకు భూమి పట్టాలను అందించారు.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అర్హులైన పేదలకు భూమి పట్టాలను అందించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కావగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని గ్రామంలోని పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గ్రామసర్పంచి, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కాముని చెరువును ఆయన  సందర్శించారు. కాముని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులను ఎమ్మార్వో వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement