కొత్త జిల్లాల ఏర్పాటుకు చట్టం | telangana district farmation act notification released | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ఏర్పాటుకు చట్టం

Dec 4 2015 2:21 AM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని పాత చట్టాన్ని యథాతథంగా అన్వయించుకుంది.

ఉమ్మడి రాష్ట్ర చట్టం అన్వయింపు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని పాత చట్టాన్ని యథాతథంగా అన్వయించుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్-1974కు బదులు తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్‌గా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

చట్టంలోని రూల్స్‌ను కూడా యథాతథంగా అన్వయించుకుంది. కాగా, జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ అన్ని జిల్లాల నుంచి సమాచారం కోరింది. పరిపాలన సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. మొత్తం 14 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement