‘తెలంగాణ’ D/O నాగేశ్వర్ | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ D/O నాగేశ్వర్

Published Wed, Aug 20 2014 12:26 AM

‘తెలంగాణ’ D/O  నాగేశ్వర్ - Sakshi

మెదక్ రూరల్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న అధికారులకు ఓ గ్రామంలో వింత సంఘటన ఎదురైంది. మెదక్ మండల పరిధిలోని పిల్లికొటాల్ గ్రామంలో అధికారి చంద్రశేఖర్, వీఆర్‌ఓ కిషన్‌లు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేకల నాగేశ్వర్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించగా, నాగేశ్వర్ తన భార్య పేరు పద్మావతి అని, కూతురు పేరు తెలంగాణ అని అధికారులకు తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోయిన అధికారులు పాప పేరు తెలంగాణ ఏమిటని ప్రశ్నించారు.

ఇందుకు నాగేశ్వర్ సమాధానమిస్తూ తనకు తెలంగాణ ఎంటే ఎనలేని గౌరవమన్నారు. అందువల్లే 2004లో పుట్టిన తన కూతురికి తెలంగాణ అని నామకరణం చేశానని చెప్పాడు. అంతేకాకుండా తన కూతురు బోనాఫైడ్‌తో పాటు ఆధార్‌కార్డులను కూడా అధికారులకు చూపించారు. అందులో కూడా పాప పేరు తెలంగాణగా నమోదై ఉండడంతో, అధికారులు సర్వేలో కూడా ఆ పాప పేరు తెలంగాణగా నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement