తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల ఆందోళనపై బీజేపీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో హరితహారం పేరుతో గిరిజన వ్యవసాయ భూములను బలవంతంగా భూములు లాక్కోవడంపై సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే తెలంగాణ కౌన్సిల్లో...పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.