పంటల వివరాలకు ప్రత్యేక పోర్టల్‌

Telangana Agriculture Department Special Portal To Register Crops Details - Sakshi

ఎన్‌ఐసీ సాయంతో ప్రత్యేక మాడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్ ‌: వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా రైతు లు, విస్తీర్ణం, పంటల వారీగా వివరాలు నమో దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ గుంట భూమిలోనూ వేసిన పంటల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం  వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్‌ కె.విజయ్‌ కుమార్‌ను చీఫ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా నియమించింది.  

పంటల సాగు విస్తీర్ణం మాడ్యూల్‌ 
రైతులు, పంటలు, సర్వే నంబరు వారీగా వివరాలు నమోదు చేసేందుకు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సహకారంతో వ్యవసాయ శాఖ ప్రత్యేక మాడ్యూల్‌ను రూపొందించింది. క్రాప్‌సోన్‌ ఏరియా మాడ్యూల్‌ (పంటల సాగు విస్తీర్ణం నమూనా)లో రైతులు, పంటల వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై ముందస్తు అంచనా వేయడం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఆయా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడంపై ప్రణాళికలు రూపొందించడం కూడా సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top