అసభ్య ప్రవర్తనతో టీచర్ సస్పెన్షన్ | teacher suspended dueto bisbehaving with students | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తనతో టీచర్ సస్పెన్షన్

Mar 1 2015 8:45 PM | Updated on Mar 28 2018 11:08 AM

తోటి టీచర్లతో, విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు.

రంగారెడ్డి జిల్లా: తోటి టీచర్లతో, విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాలు...రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న రాజేందర్‌పై ఇటీవలి కాలంలో అధికారులకు పలు ఆరోపణలు అందాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డిప్యూటీ డీఈవో ఉషారాణి ఇటీవల పాఠశాలను సందర్శించి విచారించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించిన డీఈవో రమేశ్ హిందీ పండిట్ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
(కుత్బుల్లాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement