
బిర్లా టెంపుల్ ఎక్కబోతూ..బ్రేకులు ఫెయిల్
రాజధాని నగరంలో ఓ ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి.
10 మందికి గాయాలు
హైదరాబాద్: రాజధాని నగరంలో ఓ ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. బీహార్‌లోని పట్నాకు చెందిన వీరంతా రెండు రోజుల క్రితమే నగరానికి వ చ్చారు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉంటూ శుక్రవారం ట్యాక్సీ మాట్లాడుకుని క్వాలిస్ వాహనంలో బిర్లామందిర్‌ను సందర్శించారు. దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి వెళుతుండగా వాహనం అదుపు తప్పి పార్కింగ్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న భవనం ఫెన్సింగ్ మీదుగా దూసుకెళ్లి 15 అడుగుల లోతులో పడిపోయింది.
దీంతో అందులోని మమత(40), హర్షా అగర్వాల్(16), సరితా అగర్వాల్(45), కిరణ్‌కుమార్ సింగానియా(37), కవితా సింగానియా(35), కరణ్ సింగానియా(9), బీర్ సింగానియా(5), పూజా అగర్వాల్(22), స్నేహ అగర్వాల్(20), గౌరీ గాయుపడ్డారు. బాధితులను స్థానికులు 108లో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాక్సీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.