స్విస్‌... స్వీట్‌ మెమొరీస్‌

Switzerland Tourism packages - Sakshi

స్విట్జర్లాండ్‌..సిటీ నుంచి విదేశాలకు క్యూకట్టే పర్యాటకుల జాబితాలో తప్పక ఉండే దేశం. ఈ సీజన్‌లో నగరం నుంచి మరో మూణ్నెళ్లపాటు స్విట్జర్లాండ్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. చల్లగా ఉండే ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రకృతి అంందాలతో పాటు శతాబ్ధాల నాటి వంతెనలూ, చారిత్రక ప్రదేశాలకూ నెలవైన స్విట్జర్లాండ్‌ గొప్ప జ్ఞాపకాలను అందిస్తుందని నగరానికి చెందిన టూర్‌ ఆపరేటర్లు అంటున్నారు. ల్యూసెన్స్‌ లేక్‌ మీదుగా సాగిపోయే ఓడ ప్రయాణం, దానికి సమీపంలోనే ఉండే చాక్లెట్‌ తయారీ కేంద్రాలు, రిగి, పిలాటాస్‌ పర్వతాలపై సాహసయాత్రలు, కళ్లు మూయనివ్వని మ్యూజియమ్స్, మంచు పర్వతాల నడుమ గొప్ప అనుభూతులను అందించే ఏంజెల్‌ బర్గ్, మౌంట్‌ టిట్లీస్‌...ఇలా ఎన్నో వైవిధ్యభరిత అనుభవాలు నగరవాసుల్ని స్విట్జర్లాండ్‌ని ఈ సీజన్‌లో అభిమాన టూరిస్ట్‌ ప్లేస్‌గా మారుస్తున్నాయి.  

చలో కూర్గ్‌...
సాక్షి, సిటీబ్యూరో: పర్వత ప్రాంతాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారిని వెస్ట్రన్‌ ఘాట్స్‌కి రారమ్మంటోంది మడ్డీ ట్రయల్స్‌ సంస్థ. స్కాట్‌ లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన కర్ణాటకలోని కూర్గ్‌ హిల్‌ స్టేషన్‌కు పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్‌ అందిస్తోంది. కూర్గ్‌లోని కుశాయినగర్‌లో ఉన్న ఒక అరుదైన లేక్‌ని సందర్శించడం, కావేరీ నది సమీపంలోని ఎలిఫెంట్‌ క్యాంప్‌ వగైరాలన్నీ ఇందులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఈ ట్రిప్‌ నిర్వహిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top