ప్రభుత్వానిదే బాధ్యత | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిదే బాధ్యత

Published Wed, Feb 8 2017 2:30 AM

ప్రభుత్వానిదే బాధ్యత - Sakshi

నిలోఫర్‌ ఘటనలపై సున్నం రాజయ్య  
సాక్షి, హైదరాబాద్‌ : నిలోఫర్‌ ఆసు పత్రిలో సిజేరియన్‌ ఆపరేషన్లు విఫ లమై ఐదుగురు మహిళలు మృత్యు వాత పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలన్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేయాలని, తప్పిదాన్ని కేవలం సిబ్బందిపై తోసి తప్పించుకునే ప్రయ త్నం చేయకూడదని మంగళవారం ఒక ప్రకటనలో సున్నం రాజయ్య పేర్కొ న్నారు.

గత ప్రభుత్వాల మాదిరిగా వ్యవహరిం చకుండా, దుర్గంధ పూరి తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన కనీస  బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రుల్లో శానిటేషన్, సిబ్బంది కొరత,  కావాల్సిన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి పేద రోగులకు సరైన వైద్యం  అందించాలని ఈ సందర్భంగా రాజయ్య కోరారు.

Advertisement
Advertisement