విహార యాత్రలో విషాదం.. విద్యార్థి మృతి | Student killed in the tragedy in vacation .. | Sakshi
Sakshi News home page

విహార యాత్రలో విషాదం.. విద్యార్థి మృతి

Dec 24 2015 1:10 AM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థుల విహార యాత్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

వెంకటాపురం (వరంగల్): విద్యార్థుల విహార యాత్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామప్ప చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం టవర్ గ్రామానికి చెందిన పాలకొండ మణికుమార్‌గా మృతి చెందిన విద్యార్థిని గుర్తించారు.

శరత్ వికాస్ హైస్కూల్‌కు చెందిన 49 మంది విహారయాత్రలో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట చూసుకుని రామప్పలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం స్నానం కోసం విద్యార్థులు చెరువులో దిగినప్పుడు మణికుమార్‌కు ఈత రాకపోవడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement