కూతురిని వేధిస్తుందని రెండవ భార్యపై ఫిర్యాదు | Step mother harassment, Father complaints in Police station | Sakshi
Sakshi News home page

కూతురిని వేధిస్తుందని రెండవ భార్యపై ఫిర్యాదు

Aug 16 2015 8:35 AM | Updated on Aug 16 2018 4:22 PM

రెండవ వివాహం చేసుకున్న భార్య తన కూతురిని వేధిస్తోందని ఓ తండ్రి ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

నాగోలు (హైదరాబాద్) : రెండవ వివాహం చేసుకున్న భార్య తన కూతురిని వేధిస్తోందని ఓ తండ్రి ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్ శ్రీరామాహిల్స్ కాలనీకి చెందిన టి.రమేష్ ప్రైవేటు ఉపాధ్యాయుడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇతనికి మూడు సంవత్సరాల కూతురు ఉంది. కాగా కొన్ని రోజుల తరువాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన సిహెచ్. పుష్పలతను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా 8 సంవత్సరాల బాబు ఉన్నాడు.

అయితే కొన్నాళ్లు పాపను బాగానే చూసుకున్న పుష్పలత గత కొంత కాలంగా పాపను ఇబ్బందులకు గురిచేస్తోంది. అడ్డుకోబోయిన తన తల్లి, చెల్లిని కూడా తిడుతోంది. పైగా చిన్నారి గాయపడే విధంగా కొట్టింది. దీంతో రమేష్ శనివారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు పుష్పలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement