శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం | Sri Krishna Deva Raya period, the availability of gold coins | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం

Sep 9 2015 12:41 AM | Updated on Sep 3 2017 9:00 AM

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం

ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పందెం గ్రామం సమీపంలోని పొలంలో లభ్యమైన శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి బంగారు ...

పశువుల కాపరుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు
 
ఇల్లెందు: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పందెం గ్రామం సమీపంలోని పొలంలో లభ్యమైన శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి బంగారు నాణాలను బయ్యూరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వీరేశ్వర్‌రావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐదు నెలల క్రితం ధర్మసోత్ సుందర్ అనే రైతు తన పొలంలో దుక్కు లు దున్నిన తర్వాత కురిసిన భారీ వర్షానికి ఇత్తడి బిందె బయట పడింది. పశువులకు కాపలాగా వెళ్లిన పెనక నర్సయ్య, బచ్చలి వెంకన్న, ధర్మసోత్ ధను, ఇస్లావత్ లాల్‌సింగ్‌లకు ఈ బిందె లభించింది. అందులోని నాణేలను 10 చొప్పున పంచుకున్నారు.

ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు రావడంతో పోలీసులు పశువుల కాపర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అన్ని వివరాలు బయటపడ్డారుు. మొత్తం 40 నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నాణాల తూకం 12 తులాలు ఉంటుందని, వాటిపై దేవనాగరి లిపి ఉందని, రాయల కాలం నాటి నాణేలుగా పురావస్తుశాఖ నిపుణులు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు. త్వరలో పురావస్తుశాఖ అధికారులు పరిశీలించి వాటిని మ్యూజియంకు తరలించనున్నట్లు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement