పట్టు ఉత్పత్తికి తెలంగాణ అనుకూలం | Spicy suited to the production of silk | Sakshi
Sakshi News home page

పట్టు ఉత్పత్తికి తెలంగాణ అనుకూలం

Mar 30 2015 4:17 AM | Updated on Sep 2 2017 11:33 PM

పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలమని, పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కేంద్ర పట్టు మండలి చైర్మన్ ఎన్.ఎస్.బిస్సే గౌడ అన్నారు.

పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలమని, పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కేంద్ర పట్టు మండలి చైర్మన్ ఎన్‌ఎస్.బిస్సే గౌడ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో కేంద్ర పట్టు మండలి, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నాలుగు జిల్లాల పట్టు రైతుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించేందుకు రారుుతీలు ఇస్తున్నాయన్నారు.
 
హన్మకొండ : పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలమని, పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కేంద్ర పట్టు మండలి చైర్మన్ ఎన్.ఎస్.బిస్సే గౌడ అన్నారు. ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో కేంద్ర పట్టు మండలి, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతుల సమ్మెళనం-2015 నిర్వహించారు. ఇందులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పట్టు రైతులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌ఎస్ బిస్సే గౌడ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించేందుకు రారుుతీలు ఇస్తున్నాయని చెప్పా రు. మల్బరీ సాగు చేసే రైతులకు పట్టు పరిశ్రమ శాఖ, ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం సహకారం అంది స్తున్నాయని తెలిపారు. పంట త్వరగా వచ్చేందుకు చాకీ పురుగుల పెంపకాన్ని చేపట్టామని, మల్బరీ సాగు అధికంగా ఉన్న ప్రాంతంలో చాకీ పురుగుల పెంపకం కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుడ్ల ద్వారా పట్టు పురుగులను పెంచవచ్చని, నాణ్యమైన గుడ్లను ఎక్కడికైనా నేరుగా సరఫరా చేస్తామన్నారు.

ప్రస్తుతం రైతులు పత్తి పంటపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని, పట్టు ఉత్పత్తి ద్వారా పత్తి కంటే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు శాస్త్రవేత్తలు, అధికారు ల సలహాలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న డిమాండ్ కంటే అధికంగా పట్టును ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రైతులకు ఉపయోగపడే బ్రోచర్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో బిస్సే గౌడతోపాటు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ను రైతు లు సన్మానించారు. ఈ సమ్మేళనంలో పట్టు పరిశ్రమ శాఖ వరంగల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, అధికారు లు వింధ్య, సతీష్. సంజీవరావు, శివారెడ్డి, డి.దత్తాత్రే య, బాలు, వెంకటసుబ్బయ్య, వేదకుమార్, మల్లికార్జు న్, దేవేందర్‌రావు, దాసరి మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement