మన పోలీస్‌ శాఖకు ‘స్మార్ట్‌ వెరిఫికేషన్‌’ అవార్డు | Smart policing fetches TS five awards | Sakshi
Sakshi News home page

మన పోలీస్‌ శాఖకు ‘స్మార్ట్‌ వెరిఫికేషన్‌’ అవార్డు

May 26 2017 2:46 AM | Updated on Sep 5 2017 11:59 AM

మన పోలీస్‌ శాఖకు ‘స్మార్ట్‌ వెరిఫికేషన్‌’ అవార్డు

మన పోలీస్‌ శాఖకు ‘స్మార్ట్‌ వెరిఫికేషన్‌’ అవార్డు

రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకమైన ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

► ఢిల్లీలో ఫిక్కీ అవార్డు అందుకున్న డీజీపీ
► మహేందర్‌రెడ్డికి స్మార్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అవార్డు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకమైన ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనం చేసి ఫిక్కీ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్ర పోలీసు శాఖ చేస్తున్న పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు స్మార్ట్‌ వెరిఫికేషన్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఎంపీ మీనాక్షి లేఖి, ఫిక్కీ చైర్మన్‌ వైకే మోడీ, కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ జీకే పిళ్లై చేతుల మీదుగా డీజీపీ అనురాగ్‌ శర్మ గురువారం అందు కున్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక కృషి చేస్తున్న హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు మరో అవార్డు దక్కింది.

ఈ అవార్డును సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ రఘువీర్‌ అందుకున్నారు. స్మార్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కేటగిరీ కింద హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి దక్కింది. ఈ అవార్డును హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ మురళీ కృష్ణ స్వీకరించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ మొత్తానికి స్మార్ట్‌ ఇన్నొవేటివ్‌ పోలీసింగ్‌ కింద స్పెషల్‌ జ్యూరీ అవార్డు, ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ప్రాజెక్ట్‌కు సూర్యాపేట ఎస్పీ పరిమళ హనా నూతన్‌ మరో అవార్డు సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి శాంతి భద్రతల ఇన్‌చార్జి ఐజీ రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ పోలీస్‌ శాఖ కూడా రెండు అవార్డులు స్వంతం చేసుకున్నట్లు ఫిక్కీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement