 
													సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికి రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. సోమవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని 22 వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని చెప్పారు. 23న తిరువనంతపురం వెళ్లి, 26న హైదరాబాద్ చేరుకుంటారన్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోంలో పాల్గొని, 28న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారని వివరించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
