రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ బీమా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు.
వ్యవసాయ బీమాపై ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ బీమా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, అధికారులతో మెట్ట వ్యవసాయ కేంద్ర పరిశోధన సంస్థ (క్రిడా) కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.
బ్యాంకు రుణాలు పొందిన బీమా రైతుల సంఖ్య, వారు చెల్లించిన ప్రీమియం ఎంత? ఎన్ని జిల్లాల్లో ఎందరికి బీమా సౌకర్యం లభించింది అనే విషయాలపై చర్చించి, తదుపరి చర్యలపై చర్చిస్తారని తెలిసింది. అనంతరం సచివాలయంలో ఇరు రాష్ట్రాల అధికారులతో మరోసారి భేటీ అవుతారు.