సిద్దిపేట 'గులాబీ' పురం

Siddipet : Municipalities Elected New Chairperson And Vice Chairperson - Sakshi

సాక్షి, సిద్దిపేట : మున్సిపల్‌ ఎన్నికల్లోని చివరి ఘట్టం సోమవారం ముగిసింది. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో  చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక, చేర్యాల పాలక మండలి ఎన్నిక ఏకగ్రీవం కాగా.. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడంతో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దక్కాయి. గజ్వేల్‌లో చివరి నిమిషంలో చైర్మన్‌ అభ్యరి్థని మార్చడంతో ఆగ్రహించిన అభ్యర్థి ఒంటేరు నారాయణరెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

పలు నాటకీయ పరిణామాల మధ్య నాలుగు మున్సిపాలిటీల్లోనూ  చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దక్కించుకున్నారు. అన్ని చోట్లా ఉదయం 10 గంటలకు స్థానిక ఎన్నికల అధికారి వార్డు సభ్యలతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. గజ్వేల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా 18వ వార్డులో గెలుపొందిన నేతి చిన్న రాజమౌళిని 14వ వార్డు కౌన్సిలర్‌ అలువాల బాలేష్‌ ప్రతిపాదించారు.

1వ వార్డు కౌన్సిలర్‌ బొగ్గుల చందు మద్దతు తెలిపి బలపరిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్‌ అభ్యరి్థతోపాటు, 12వ వార్డు కౌన్సిలర్‌ ఒంటేరు నారాయణరెడ్డి ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మిగిలిన 18 మంది మద్దతుతో చిన్నరాజమౌళిని చైర్మన్‌గా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైస్‌ చైర్మన్‌గా 8వ వార్డు నుంచి గెలిచిన జకీరోద్దిన్‌ను 15వ వార్డు కౌన్సిలర్‌ ఉప్పల మెట్టయ్య ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి పంబాల అర్చన బలపర్చారు. ఈయనకు కూడా 18 మంది మద్దతు తెలపడంతో వైఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

దుబ్బాకలో ఏకగ్రీవం.. 
దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్‌గా 18వ వార్డు కౌన్సిలర్‌ గన్నె వనితను మూడో వార్డు కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి ప్రతిపాదించగా నాలుగో వార్డు కౌన్సిలర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌ బలపరిచారు. అయితే ఇతర పారీ్టల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

హుస్నాబాద్‌లో రసవత్తరం.. 
హుస్నాబాద్‌లో మొత్తం 20 వార్డులకు గాను తొమ్మిది టీఆర్‌ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు బీజేపీ, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యరి్థగా 15వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుల రజిత పేరును 20 వార్డు కౌన్సిలర్‌ వాలా సుప్రజ ప్రతిపాదించారు. 5వ వార్డు కౌన్సిలర్‌ పెరుక భాగిరెడ్డి బలపరిచారు. కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యరి్థగా ఏడో వార్డు కౌన్సిలర్‌ చిత్తారి పద్మ పేరును 8వ వార్డు కౌన్సిలర్‌ మ్యాదరబోయిన శ్రీనివాస్‌ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్‌ వల్లపు రాజయ్య బలపర్చారు.  అయితే టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు 9 మందితోపాటు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్‌ కుమార్‌ తన ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు.

దీంతో 12 మంది మద్దతు టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థికి లభించింది. బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థులు పోలింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మెజార్టీ ఓట్లు పొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆకుల రజితను చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైఎస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాలుగో వార్డు కౌన్సిలర్‌ ఐలేని అనిత పేరును ఒకటో వార్డు కౌన్సిలర్‌ కొంకట నళినీదేవి ప్రతిపాదించారు. 19వ వార్డు కౌన్సిలర్‌ బొజ్జ హరీశ్‌ బలపరిచారు. కాంగ్రెస్‌ వైఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి మూడో వార్డు కౌన్సిలర్‌ కోమటి స్వర్ణలత పేరును 8వ వార్డు కౌన్సిలర్‌ మ్యాదరబోయిన శ్రీనివాస్‌ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్‌ వల్లపు రాజయ్య బలపరిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించింది. వీరికి ఎక్స్‌అఫీíÙయో ఓటు ఎమ్మెల్యే వేయడంతో మొత్తం 12 మంది మద్దతుతో వైస్‌చైర్మన్‌ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.   

చేర్యాలలో ఉత్కంఠకు తెర 
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సముజ్జయిలుగా గెలిచిన చేర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన నిమ్మ రాజీవ్‌రెడ్డి, జుభేదా ఖతూంలు చైర్మన్‌ ఎన్నికకు ముందుగానే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యరి్థగా ఒకటవ వార్డు కౌన్సిలర్‌ అంకుగారి స్వరూపారాణి పేరును 12వ వార్డు కౌన్సిలర్‌ పచ్చిమడ్ల సతీష్‌ ప్రతిపాదించగా ఐదవ వార్డు కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌ బలపరిచారు. వైస్‌ చైర్మన్‌గా నాలుగో వార్డు కౌన్సిలర్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి పేరును 12వ వార్డు కౌన్సిలర్‌ పచిమడ్ల సతీష్‌ ప్రతిపాదించగా ఐదో వార్డు కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌ బలపరిచారు. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనక పోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు స్వరూపారాణి చైర్మన్‌గా రాజీవ్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రవణ్‌కుమార్‌ ప్రకటించారు.  

ఆఖరి క్షణంలో మార్పు.. 
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ అభ్యర్థుల పేర్లు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి గజ్వేల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యరి్థగా ఒంటేరు నారాయణరెడ్డి పేరు ప్రచారం జరిగింది.  ఊహించినట్లుగానే గజ్వేల్‌ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. వీరికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఒంటేరు నారాయణరెడ్డి చైర్మన్‌ పదవి ఖాయం అని అందరు భావించారు. అయితే ఎన్నిక జరిగిన సోమవారం మాత్రం అంతా తారుమారైంది.

 ఒక్కసారిగా చైర్మన్‌ అభ్యర్థిగా నేతి చిన్న రాజమౌళి పేరు తెరమీదికి వచి్చంది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అందరూ ఆయనకే మద్దతు తెలిపి రాజమౌళిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఖంగుతిన్న నారాయణరెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తన కౌన్సిలర్‌ పదవికి, టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డికి తన రాజీనామ పత్రాన్ని అందచేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top