లఘుచిత్రాల సినిమాటోగ్రాఫర్‌

Shortfilms Cinematographer Sudhakar Special Story - Sakshi

కెమెరామెన్‌గా రాణిస్తున్న సుధాకర్‌

జూబ్లీహిల్స్‌: చిట్టీలు వేసి డబ్బులు జమ చేసి చిన్న 5డీ కెమెరాను కొనుగోలు చేసిన సుధాకర్‌... షార్ట్‌ఫిలిమ్స్‌ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో నివసించే సుధాకర్‌ ఇప్పటికే వందలాది ఫార్ట్‌ఫిలిమ్స్‌ను తెరకెక్కించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్‌ఫోన్లలో అత్యుత్తమ నాణ్యతతో కెమెరాలు రావడంతో... ఫోన్‌లోనే షార్ట్‌ఫిలిమ్స్‌ చిత్రీకరించి శెభాష్‌ అనిపించుకున్నాడు.  

150కి పైగా షార్ట్‌ఫిలిమ్స్‌...
నాలుగైదేళ్లుగా షార్ట్‌ఫిలిమ్స్‌ ట్రెండ్‌ పెరగడంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్‌. షార్ట్‌ఫిలిమ్‌ మేకింగ్‌లో పట్టు సాధించి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా పని చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘రహస్యం’ సినిమాకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్‌ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్‌ తెరకెక్కించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ ,శ్వాసనువ్వే, రుధిరం తదితర లఘు చిత్రాలకు మంచి పేరొచ్చింది.  

వర్మ స్ఫూర్తితో..  
తిలక్‌ దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ‘మా ఊరి వంట’ కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పని చేశాను. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకొని 5డీ కెమెరా కొనుగోలు చేశాను. షార్ట్‌ఫిలిమ్స్‌కు పనిచేస్తూ పేరు సంపాదించాను. మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.– సుధాకర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top