జూన్‌ 20 నుంచి గొర్రెల పంపిణీ | Sheep distribution from June 20: Talasani | Sakshi
Sakshi News home page

జూన్‌ 20 నుంచి గొర్రెల పంపిణీ

Apr 18 2017 1:04 AM | Updated on Sep 5 2017 9:00 AM

జూన్‌ 20 నుంచి గొర్రెల పంపిణీ

జూన్‌ 20 నుంచి గొర్రెల పంపిణీ

గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 20న ప్రారంభించనున్నట్లు పశుసం వర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటించారు.

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్‌: గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 20న ప్రారంభించనున్నట్లు పశుసం వర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు విధివిధానాలపై సోమవారం మంత్రి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గొర్రెల పంపిణీని జిల్లా స్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభిస్తారనే సమాచారం త్వరలోనే తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఈ సంవ త్సరం 2లక్షల కుటుంబాలకు, వచ్చే ఏడాది మిగిలిన 2లక్షల కుటుంబాలకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు తహసీల్దార్,ఎంపీడీవో, పశువైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ పనిచేస్తుందని వివరించారు.

20 నుంచి వర్క్‌షాప్‌లు...
ఈ పథకంపై ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. మే 1 నుంచి 10 వ తేదీ వరకు పశుసంవర్థకశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి గ్రామాల్లో గొల్ల, కుర్మలను రూ.51 రుసుముతో సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. సొసైటీలులేని గ్రామాల్లో నూతన సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. అదే నెల 10 నుంచి 20 వరకు గ్రామసభలు నిర్వహించి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నూతనంగా రానున్న 40లక్షల గొర్రెలకు దాణా కొరత ఏర్పడ కుండా చూడాలన్నారు.

గడ్డి విత్తనాలు, చాప్‌ కట్టర్లపై సబ్సిడీ
గొర్రెలకు దాణా కొరత ఏర్పడకుండా 75% సబ్సిడీపై గడ్డి విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. గడ్డిని కత్తిరించే చాప్‌కట్టర్లను కూడా 75% సబ్సిడీపై అందజేస్తామన్నారు. గొర్రెల మంద వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిం చేలా నియోజకవర్గానికి సంచార పశువైద్య శాల త్వరలో అందుబాటులోకి వస్తుందన్నా రు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement