ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా..? లేనట్టా..? | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా..? లేనట్టా..?

Published Sun, Sep 28 2014 2:12 AM

Seems to be the center of the grain to buy ..? Clear ..?

- ఆసక్తి చూపని మహిళా సంఘం సభ్యులు
- గతేడాది నిర్వహణ ఖర్చులు ఇంకా చెల్లించకపోవడమే కారణం
- ఖర్చులు తాము భరించి అప్పుల్లో కూరుకుపోయామని మహిళల ఆవేదన
- బకాయిలు చెల్లిస్తేనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ
యాచారం: డ్వాక్రా సంఘాల మహిళలు ఈ ఏడాది మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిర్వహణ బిల్లులు ఇంకా చెల్లించకపోవడమే దీనికి కారణం. తమ బకాయిలు చెల్లించాలని డీఆర్‌డీఏ, సివిల్ సప్లై అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం కనబడకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వారం రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అందుకోసం మండలంలోని చింతపట్లలో ఉన్న పీఏసీఏస్ భవనాన్ని ఇందుకోసం అధికారులు పరిశీలించారు. కొన్నిరోజుల పాటు ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి శాశ్వత గిడ్డంగి లేకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యేటా ధాన్యం నిల్వలకు కొత్త కొనుగోలు కేంద్రాలు వెతకాల్సిన పరిస్థితి. చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లో గిడ్డంగి భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో భవనాలు మాత్రం నిర్మించలేదు.
 
అందాల్సిన బకాయిలు రూ. 5 లక్షలు
చాలా వ్యయప్రయాసలు కూర్చి మహిళలు ధాన్యం కొనుగోలు చేస్తున్నా వారికి మాత్రం లబ్ధి చేకూరడం లేదు. ధాన్యం కొనుగులు కేంద్రం నిర్వహణ కింద మ హిళా సంఘాలకు చెల్లించాల్సిన కమిషన్‌ను సకాలంలో విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. గతేడాది మొక్కజొన్న, ఈ ఏడాది జూన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి చింతపట్ల డ్వాక్రా సంఘం మహిళలకు రూ.5లక్షలకు పైగా నిర్వహణ బిల్లులు అందాల్సి ఉంది. డ్వాక్రా సం ఘాల మహిళలు కూలీల ద్వారా కొనుగోళ్లు జరిపించి అప్పులుచేసి వారికి డబ్బులు చెల్లించారు.

నిర్వహణ చేపడితే లాభాలు వస్తాయని ఆశపడిన మహిళలకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారి అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది మొక్కజొన్న కొనుగోలు సంబంధించి రూ. లక్ష వరకు, వరి ధాన్యం కొనుగోలు జరిపినందుకు గాను రూ.4లక్షలకుపైగా బకాయి అందా ల్సి ఉంది. నిర్వహణ బిల్లులు ఇప్పించాలని చిం తపట్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు పలుమార్లు నగరంలోని అధికారులతోపాటు స్థానిక అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిం ది. దీంతో గత బకాయిలు చెల్లిస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఈసారి ముందుకు వస్తామని మహిళ సంఘం తేల్చిచెప్పింది. దీంతో మరో వారం రోజుల్లో మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అవుతుందా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.

Advertisement
Advertisement