నిర్మల్‌లోఎస్‌ఈ కార్యాలయం! | se office built in nirmal | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లోఎస్‌ఈ కార్యాలయం!

Dec 30 2014 11:41 PM | Updated on Sep 2 2017 6:59 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం పర్యవేక్షక ఇంజినీర్..

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయాన్ని నిర్మల్‌లో నెలకొల్పనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ రెండు జిల్లాలకు కలిపి ఉండే ఈ కార్యాలయాన్ని నిర్మల్‌లో ఏర్పాటు చేయడం ద్వారా రెండు జిల్లాల పనులు, నిర్వహణ ను సులభంగా పర్యవేక్షణ చేయవచ్చని ఆర్‌డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గ్రిడ్ ద్వారా మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు, నాలుగు మున్సిపాలి టీలకు తాగునీరందించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆదిలాబాద్, ని ర్మల్, బోథ్ నియోజకవర్గాలతోపాటు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూ ర్, బాల్కొండ, కామారెడ్డి, నిజామాబాద్, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 21 మండలాలు ఈ గ్రిడ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ గ్రిడ్‌ను పర్యవేక్షణ కోసం ఎస్‌ఈ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

14 డిప్యూటీ ఈఈ పోస్టులు..
ఈ పథకానికి సంబంధించి ఇంజినీర్ల నియామకాలకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 492 ఇంజనీర్లతో సహా, మొత్తం 529 మంది ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు నాలుగు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేయనుంది.

జిల్లాలో నాలుగు గ్రిడ్‌లకు అనుమతి మంజూరైన నేపథ్యంలో గ్రిడ్‌కు ఒకరు చొప్పున నలుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను కేటాయించాలని ఇక్కడి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ఒక్కో డివిజన్‌కు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల చొప్పున ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్  డివిజన్లకు 12 మంది, కడెం, మంచిర్యాల గ్రిడ్‌లకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది డీఈలను కేటాయించనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే జేఈ పోస్టులు సుమారు 55 వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement