ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ చార్జీలు తాత్కాలికంగా పెంపు | Sankranti Festival: Platform ticket price Temporary hiked | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ చార్జీలు తాత్కాలికంగా పెంపు

Jan 8 2020 8:46 PM | Updated on Jan 8 2020 8:52 PM

Sankranti Festival: Platform ticket price Temporary hiked  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ చార్జీ రూ.20 కి పెరుగనుంది. సంక్రాంతి ప్రయాణికుల రద్దీని  దృష్టిలో ఉంచుకొని  ఈ నెల  9వ తేదీ నుంచి  20వ తేదీ వరకు  తాత్కాలికంగా చార్జీలను పెంచినట్లు  సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌  తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని  ఈ మార్పు చేసినట్లు  పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, ఇతరుల రద్దీని నియంత్రించేందుకే చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు స్పష్టం చేశారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లుకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలుమార్గాల్లో అదనంగా రైళ్లను నడుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement