నోటికి నల్లగుడ్డతో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ

RTC Workers Hold Silent Protest In Wanaparthy Depo - Sakshi

నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు 

ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన

సాక్షి, వనపర్తి: ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని పోలీసుల నిర్భందాలతో ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆర్‌.గోపిగౌడ్, సీపీఎం  జిల్లా కార్యదర్శి జబ్బార్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సమ్మెశిబిరం నుంచి ఆర్టీసీ కార్మికులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని బస్టాండ్‌ మీదుగా, రాజీవ్‌చౌక్, బస్‌ డిపోరోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆర్టీసీ డిపోఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో ట్యాం క్‌బండ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. పోలీసుల తీరు అమానుషమని, సమైక్య పాల కుల హయాంలోకంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా డిమాండ్లు సా ధించే వరకు పోరు ఆపబోమని అన్నారు. న్యా యస్థానాలు సూచించినా, 36 రోజులుగా ఏకధాటిగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. ప్రభు త్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దే శం ప్రభుత్వానికి ఉంటే చర్చలకు ఎందుకు పిలవడం లేదన్నారు.

ఆర్టీసీని నిర్మూలించాలనే ఆశయంతోనే ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో పదుల సంఖ్యలో కార్మికులు అమరులు అవుతు న్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు పస్తులతో పోరాటం చేస్తున్నార ని అన్నారు. తెలంగాణపోరాట స్ఫూర్తితోనే ఆర్టీ సీని కాపాడుకునేంత వరకు ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీపై ఉన్నతాధికారులు హైకోర్టుకు ఇస్తున్న నివేదికలతోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వెంకటయ్య, రమేష్, వీవీమూర్తి, శ్రీలత, ప్రభరాణి, లక్ష్మీ, రేణుక, చపలతిరెడ్డి, నందిమల్ల నాగరాజు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top