ఆర్టీసీ సమ్మె: రాత్రి 11.30 వరకు మెట్రోరైళ్లు..! | RTC Strike, Metro Trains To Be Available Till 11.30 PM | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: రాత్రి 11.30 వరకు మెట్రోరైళ్లు..!

Oct 6 2019 6:56 PM | Updated on Oct 6 2019 7:11 PM

RTC Strike, Metro Trains To Be Available Till 11.30 PM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా రెండోరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో నగరంలోని మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఆదివారం ప్రయాణికులతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సులు తిరగకపోవడం, ప్రైవేటు వాహనాల్లో భారీగా చార్జీలు వసూలు చేస్తుండటంతో నగరవాసులు మెట్రోరైలుపై పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 11.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లను హైదరాబాద్‌ మెట్రో నడుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement