రూ. 5కోట్ల విలువైన బంగారం స్వాధీనం; ఇద్దరి అరెస్ట్ | Rs 5 cr worth gold seized by police at Nalgonda check post | Sakshi
Sakshi News home page

రూ. 5కోట్ల విలువైన బంగారం స్వాధీనం; ఇద్దరి అరెస్ట్

Dec 23 2014 6:12 AM | Updated on Sep 2 2017 6:38 PM

జిల్లాలోని కోదాడ మండలం నల్లబండ గూడెంలో ఏపీపీఓ బోర్డర్ చెక్ పోస్టు తనిఖీలు నిర్వహించారు.

నల్గొండ : జిల్లాలోని కోదాడ మండలం నల్లబండ గూడెంలో ఏపీపీఓ బోర్డర్ చెక్ పోస్టు తనిఖీలు నిర్వహించారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు. ఆధారాలు లేకుండా అక్రమంగా తీసుకెళ్తున్న రూ.5.72 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement