ఓ రౌడీషీటర్‌ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.
హైదరాబాద్ సిటీ: ఓ రౌడీషీటర్‌ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో చోటుచేసుకుంది. మృతుడు సయ్యద్ అహ్మద్(25), సయ్యద్ రియాజ్‌లు ఇద్దరూ రౌడీషీటర్‌లు. వీరిద్దరి మధ్య వివాదం ఉంది.
మరో రౌడీషీటర్ వీరిద్దరిని పిలిచి పంచాయతీ చేస్తుండగా సయ్యద్ రియాజ్ ఆవేశం తట్టుకోలేక సయ్యద్ అహ్మద్‌ను ఛాతీలోపల కత్తితో పొడిచాడు. కొన ఊపిరితో ఉన్న అహ్మద్ ను దగ్గర్లోని డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.