ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో గురువారం కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు
మహబూబ్‌నగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో గురువారం కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్నారని వంశీ కృష్ణ ఈ సందర్భంగా ఆరోపించారు.
(అచ్చంపేట)