డాక్టర్ల సంఘం.. డిష్యుం డిష్యుం | rift in telangana doctros association | Sakshi
Sakshi News home page

డాక్టర్ల సంఘం.. డిష్యుం డిష్యుం

Jul 1 2014 11:02 AM | Updated on Aug 25 2018 6:08 PM

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. డాక్టర్ రమేశ్‌ వర్గం, డాక్టర్ ప్రవీణ్‌ కుమార్ వర్గాల మధ్య ఉన్న వైరం వల్ల తెలంగాణ వైద్యులు చీలుతున్నారు. పోటాపోటీగా సమావేశాలు, కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంతమంది తెలంగాణకు చెందిన వైద్యులు ఏ వర్గంలో చేరాలోనని తల పట్టుకుంటున్నారు. ఆదివారం ప్రవీణ్‌కుమార్ వర్గం టీజీడీఏ కమిటీని ప్రకటించగా అదే రోజు రమేశ్‌ వర్గం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సోమవారం కోఠిలోని తెలంగాణ వైద్య భవన్‌లో రమేశ్‌వర్గం సీజీసీ సమావేశం ఏర్పాటు చేసి చింతరమేశ్, రవిశంకర్, లాలుప్రసాద్‌యాదవ్, నీలకంఠేశ్వరావును టీజీడీఏ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేశారని, 42 మందిలో కేవలం ఆరుగురే జీసీఏ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఆ కమిటీ చెల్లదని, టీజీడీఏకు వ్యతిరేకంగా కమిటీని ఏర్పాటు చేసినవారి ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తున్నామని ప్రకటించారు. జూలై 27న ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ వైద్యులు డాక్టర్ పుట్ల శ్రీనివాస్, నరహరి, జయశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement