ఆర్టీసీ సమ్మెకు రిటైర్డ్ టీచర్ రూ. 25వేల సాయం

సాక్షి, ఖమ్మం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో పాల్గొన్న కార్మికులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సమ్మె మరింత ఉదృతం అయ్యింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాల నుంచి, ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికుల్ని వేధిస్తుంటే.. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా లెక్కచేయకుండా సహాయం చేయడానికి ముందుకొచ్చారు 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగ విరమణ చేసిన రేగులగడ్డ విజయ కుమారి. గత 14 రోజులుగా అపూర్వ ఐక్యతతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వారి పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రూ. 25 వేలు ఖమ్మం డిపో జేఏసీకి అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు విజయ కుమారి చేసిన సాయానికి ఆర్టీసీ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి