పెండింగ్ కేసుల్ని పరిష్కరించండి

హైకోర్టు సీజే జస్టిస్ ఆర్.ఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం హైకోర్టు నుంచి ఆయన అన్ని జిల్లాల జడ్జిలు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెరోపేరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసులను ప్రారంభించారు. ఐసీజేఎస్ సర్వీసులను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ విధానం ద్వారా క్రిమినల్ కేసుల విచారణ కూడా పూర్తి చేసి పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి