మంచిర్యాల పట్టణంలో ఆక్రమణల తొలగింపు | Removal of poaching in the town of manciryala | Sakshi
Sakshi News home page

మంచిర్యాల పట్టణంలో ఆక్రమణల తొలగింపు

Feb 5 2015 10:21 PM | Updated on Sep 2 2017 8:50 PM

ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఆక్రమణలపై మునిసిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు.

మంచిర్యాల (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఆక్రమణలపై మునిసిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తాలో రహదారులపై వాహనాల, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన షెడ్లు, ఫ్లెక్సీబోర్డులు, హోర్డింగులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను గురువారం సాయంత్రం అధికారులు సిబ్బందితో వచ్చి తొలగించారు.

జూలైలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పట్టణంలోని అన్ని మార్గాల్లో రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం నుంచి ఆక్రమణల తొలగింపు నిరవధికంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement