మెడికల్‌ పీజీ సీట్లలో కోటా పునరుద్ధరించాలి  | Quota should be recovered in Medical PG seats | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ సీట్లలో కోటా పునరుద్ధరించాలి 

Dec 31 2018 1:54 AM | Updated on Dec 31 2018 1:54 AM

Quota should be recovered in Medical PG seats - Sakshi

ఆదివారం ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో సంఘీభావాన్ని ప్రకటిస్తున్న దక్షిణాది రాష్ట్రాల వైద్యుల సంఘం ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ సీట్లలో ఇన్‌సర్వీస్‌ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఇన్‌సర్వీస్‌ కోటా సీట్లను సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పి.సుధాకర్‌ మాట్లాడుతూ దేశంలో 11 రాష్ట్రాలు ఇన్‌సర్వీస్‌ కోటాను ప్రవేశపెట్టాయని, దీంతో చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చారన్నారు. అయితే నీట్‌ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైందన్నారు. దీంతో ప్రజాఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందన్నారు.

ఇన్‌సర్వీసెస్‌ కోటా రద్దు నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఇన్‌సర్వీస్‌ కోటాపై తమిళనాడు ప్రభుత్వ వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ను వేశారని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జాతీయ స్థాయిలో దీనిపై కీలక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇన్‌సర్వీస్‌కోటాను పునరుద్ధరించాలని ఎన్‌ఎంసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైద్యులకు ఇచ్చే వేతనాలు, అలవెన్సులపైనా సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం ఇక నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి డాక్టర్‌ రాజేశ్‌గైక్వాడ్‌( మహారాష్ట్ర), కత్రివేలు(తమిళనాడు), డా.రావూఫ్‌(కేరళ), డా. జయధీర్‌(ఏపీ), రంగానాథ్‌(కర్ణాటక), డాక్టర్‌ ప్రవీణ్‌(టీజీజీఎ) తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ లాలుప్రసాద్‌ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్యాణ్‌చక్రవర్తి, దీన్‌దయాల్, డాక్టర్‌. జనార్థన్‌తో పాటు పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement