పీవైఎల్ తెలంగాణ కమిటీ ఏర్పాటు | PYL telangan committe established | Sakshi
Sakshi News home page

పీవైఎల్ తెలంగాణ కమిటీ ఏర్పాటు

Apr 2 2015 7:59 PM | Updated on Apr 7 2019 3:50 PM

ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నిక గురువారం జరిగింది.

ఖమ్మం: ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నిక గురువారం జరిగింది. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగిన పీవైఎల్ రాష్ట్ర మహాసభలలో కమిటీ ఎన్నిక జరిగింది. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరదయ్య (నిజామాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ రాజేందర్ ( వరంగల్), ఉపాధ్యక్షుడిగా తుడుం వీరభద్రం (ఖమ్మం), సహాయ కార్యదర్శిగా మోకాళ్ల రమేష్ (ఖమ్మం), కోశాధికారిగా మోతిలాల్ (నల్గొండ)లను ఎన్నుకున్నారు.

వీరితో పాటు తొమ్మిది మంది కార్యవర్గసభ్యులను కూడా ఎన్నుకున్నారు. వీరిలో బాలయ్య (నిజమాబాద్), కృష్ణ (హైదరాబాద్), ఆర్. ఆశోక్, పి. నరేష్, దనసరి కుమారి (ఖమ్మం), బండారి రాజు(ఆదిలాబాద్), గని (కరీంనగర్), వి. మల్లేష్ (నల్గొండ), బి. రాజు(వరంగల్)లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement