నగర, పురపాలక సంఘాలు ఇకపై ఆన్‌లైన్‌లో ఆస్తి పన్నులు వసూలు చేయనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: నగర, పురపాలక సంఘాలు ఇకపై ఆన్‌లైన్‌లో ఆస్తి పన్నులు వసూలు చేయనున్నాయి. పురపాలక శాఖ కమిషనరేట్ వెబ్‌సైట్(www.cdma.gov.in) ద్వారా ఆన్‌లైన్ లో పన్నులను చెల్లించవచ్చు. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు బి.జనార్దన్ రెడ్డి ఎస్‌బీహెచ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
పురపాలక సంఘాల్లోని పన్నులు చెల్లింపు కౌంటర్ల వద్ద ఈడీసీ యంత్రాలను ఏర్పాటు చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్నులు వసూలు చేయనున్నారు.