వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి

Published Sun, Jun 11 2017 4:45 AM

Pregnant sacrifices for the negligence of doctors

►  తప్పు కప్పిపుచ్చేందుకు వైద్యులయత్నాలు
► మరణించిన గంటన్నర  తర్వాత పెద్దాసుపత్రికి రెఫర్‌


జైనూర్‌(ఆసిఫాబాద్‌): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి బలైంది. పురిటి నొప్పులు, వాంతులతో బాధపడుతూ చికి త్స కోసం ఆస్పత్రికి వచ్చిన గిరిజన గర్భిణి గంటసేపు నరక యాతన అనుభవించింది. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు వైద్యులు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గర్భిణి మరణించిన గంట సేపు తర్వాత మరో ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. మృతి చెందిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించినా.. తమ నిర్వాకం బహిర్గతం కాకుండా ఉండేందుకు డెత్‌ సర్టిఫి కెట్‌ అవసరం ఉంటుందని మెప్పించినట్లు బాధిత కుటుంబీ కులు తెలిపారు.

జైనూర్‌ మండల కేంద్రం రాంనగర్‌కు చెం దిన ఆత్రం అరుణకు పురిటినొప్పులు రావడంతో శనివారం జైనూర్‌ ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆమె భర్త సుదర్శన్‌ డాకర్ట్స్‌ క్వార్టర్స్‌కు వెళ్లి విషయం చెప్పారు. గంటసేపు తర్వాత వచ్చి న వైద్యుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అరుణ కొద్ది సేపటికే కన్నుమూసింది. మర ణించిన గంట తర్వాత అరుణను అవ్వాల్‌ అంబులెన్స్‌లో ఉట్నూర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

శవాన్ని ఉట్నూర్‌ ఎందుకు పంపిస్తున్నారని వైద్యులను నిలదీయగా ..డెత్‌ సర్టిపికెట్‌ కోసం ఉట్నూర్‌ వెళ్లాల్సిందేనని చెప్పినట్లు సుదర్శన్‌ వివరిం చాడు. అయితే, అంబులెన్స్‌లో ఉట్నూర్‌ వెళ్లగా అప్పటికే ఫోన్‌ మాట్లాడుకున్న ఉట్నూర్‌ ఆస్పత్రి వైద్యుడు వాహనం వద్దకే వచ్చి శ్వాస ఆడక మృతి చెందిందని చెప్పి తిరిగి పంపించినట్లు కుటుంబీకులు తెలిపారు.

గైనకాలజిస్ట్‌ ఒపినియన్‌ కోసం పంపించాం
అరుణ మరణించిన తర్వాత ఉట్నూర్‌ ఆస్పత్రికి పంపించిన విషయమై వైద్యుడు నరేశ్‌ను సంప్రదించగా, మృతికి గల కారణాలతో పాటు.. మరణించినట్లు ధ్రువీకరించేందుకు గైనకాలజిస్ట్‌ ఒపినియన్‌ కోసం పంపించానన్నారు. తాను వెంటనే చికిత్స ప్రారంబించానని ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement