పోల్‌ చిట్టీ.. ఓ గూగుల్‌ మ్యాప్‌! | Sakshi
Sakshi News home page

పోల్‌ చిట్టీ.. ఓ గూగుల్‌ మ్యాప్‌!

Published Wed, Dec 5 2018 2:39 PM

Poll Quote .. A Google Map! - Sakshi

సాక్షి, కల్వకుర్తి టౌన్‌: ఎన్నికల సంఘం పంపిణీ చేసిన ఓటర్‌ స్లిప్పు గూగుల్‌ మ్యాప్‌లా ఉపయోగపడనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో అభ్యర్థులే తమ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు జాబితాలో వారి సంఖ్య చూసి పోల్‌ చిట్టీలు రాసిచ్చేవారు.

దాన్ని తీసుకుని వారు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈ సారి ఎన్నికల సంఘం పోల్‌ చిట్టీలను ముద్రించి నేరుగా ఓటర్‌ ఇంటికి వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మెదలైంది. చిట్టీ మీద ఫొటోతో పాటుగా ఓటరు జాబితాలో ఉన్న ఐడీ నంబర్, వెనక తన ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉంది, ఆ కేంద్రం ఎక్కడ ఉంది, ఏ దారి గుండా, ఏ దిక్కుకు వెళ్లాలి అనే రూట్‌మ్యాప్‌ను ముద్రించింది.   


చివరి దశలో పంపిణీ  
జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో 8,23,858మంది ఓటర్లు ఉండగా 1,032పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి ఓటరుకు పోల్‌ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధిత బీఎల్‌ఓలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 95 శాతం మేర పోల్‌ చిట్టీలు పంపిణీ చేశారు.  


గుర్తింపు కార్డులా పోల్‌ చిట్టీ  
గతంలో పోల్‌ చిట్టీ తెల్లకాగితం మీద రాసిచ్చేవారు. ప్రస్తుతం ఓటరు జాబితాలోని ఓటరు ఫొటోతో పాటు వారి పేరు, ఎపిక్‌ నంబర్, పోలింగ్‌ కేంద్రం నంబర్‌ కూడా ఉండడంతో ఇదో గుర్తింపు కార్డు మాదిరిగా అయింది. గతంలో ఓటు వేసేందుకు ఓటర్‌ ఐడీ కార్డు లేనివారు రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, బ్యాంకు పాస్‌బుక్‌.. ఇలా ప్రభుత్వ గుర్తింపుపొంది జారీ చేసి 12 రకాల గుర్తింపు కార్డులు తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవేమీ అవసరం లేకుండా ఒక్క పోల్‌ చిట్టీ ఉంటే సరిపోతుంది. 

Advertisement
Advertisement