
తనగల గట్టుపై ఎస్పీ రెమా రాజేశ్వరి, పోలీసులు
శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మండలంలోని తనగల గుట్టలపై పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ ఆర్.భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావుతోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు అక్కడికి చేరుకున్నారు. కాలినడకన సుమారు 5కి.మీ. గట్టుపైకి ఎక్కి ఫ్రెండ్లీగా కబడ్డీ ఆడి పర్దీపురం శివారులో కిందకు దిగారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ‘మన కుటుంబం–మన ఆరోగ్యం’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శిక్షణ సమయంలో తప్పా శారీరక శ్రమ లేకపోవడంతో పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వారు ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం పొందాలనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ చేపట్టామన్నారు. అంతేగాక ఎవరెవరు ఏ మేరకు ఫిట్‌నెస్ కలిగి ఉన్నారనేది పరీక్షించామన్నారు.