
సాక్షి, కల్వకుర్తి రూరల్: రాబోయే శాసనసభా ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అన్ని పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. శుక్రవారం పట్టణంలోని మడేలయ్యస్వామి దేవస్థానం వద్ద రజక సంఘం సమావేశం నిర్వహించారు.
సమావేశానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి సంఘం నాయకులతోపాటు సభ్యులతో మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధికి బాటలు వేస్తానని చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్క అవకాశమిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు ఆచారికి మద్దతు తెలిపినట్లు పార్టీ నాయకులు విలేకరులకు వివరించారు. సమావేశంలో రజక సంఘం నాయకులు లింగమయ్య, విజయ్, నాగరాజు, పర్వతాలు, శ్రీధర్, మొగులయ్య, శ్రీను, శంకర్, సత్యనారాయణ, పెంటయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.