హాస్టల్ మెస్ల మూసివేత.. ఓయూలో ఆందోళన | osmania university hostel mess closed, students agitate | Sakshi
Sakshi News home page

హాస్టల్ మెస్ల మూసివేత.. ఓయూలో ఆందోళన

Apr 17 2015 10:26 AM | Updated on Sep 3 2017 12:25 AM

హాస్టల్ మెస్ల మూసివేత.. ఓయూలో ఆందోళన

హాస్టల్ మెస్ల మూసివేత.. ఓయూలో ఆందోళన

ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీకి చెందిన హాస్టల్ మెస్లను శుక్రవారం నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించడంతో యూనివర్సిటీలో ఆందోళన మొదలైంది.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీకి చెందిన హాస్టల్ మెస్లను శుక్రవారం నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించడంతో యూనివర్సిటీలో ఆందోళన మొదలైంది. ఓయూకు సంబంధించిన అన్ని హాస్టల్ మెస్ల ఖాతాలో బ్యాలెన్స్ లేదని, తమకు రావాల్సిన స్కాలర్షిప్లను సాంఘి సంక్షేమ శాఖ నుంచి ఇంకా విడుదల చేయలేదని.. దాంతో శుక్రవారం ఉదయం అల్పాహారం తర్వాత ఏ, సీ హాస్టళ్లను మూసేస్తున్నామని నోటీసుబోర్డులో తెలిపారు.

దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మరింత బాగుంటుందని ఆశిస్తే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కనీసం తమకు తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై రిజిస్ట్రార్ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణారావులను కలిసి తమ ఆందోళనను తెలియజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement