లారీని, వ్యాన్ ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
నిజామాబాద్(సదాశివనగర్): లారీని, వ్యాన్ ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు...నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులో మద్యం మత్తులో ఉన్న వ్యాన్ డ్రైవర్, లోడ్‌తో వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపు తప్పి అదే వాహనాన్ని ఢీకొట్టాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యాన్ డ్రైవర్ బాపు బాయి కామారెడ్డ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.