ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయలైన సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
తుర్కపల్లి(నల్లగొండ జిల్లా): ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయలైన సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వేల్పుపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ శ్రీనివాస్‌నాయక్ అగండికి వెళ్లి వస్తుండగా యాదగిరిగుట్ట నుండి ఎదురుగా వస్తున్న మోటర్ సైకిల్ ఢీ కొనడంతో శ్రీనివాస్‌కు తీవ్రగాయలయ్యాయి. స్ధానికులు వెంటనే శ్రీనివాస్‌ను తుర్కపల్లిలోని ప్రైవేట్ అసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు.