రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం | One dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

Jul 26 2015 8:10 AM | Updated on Aug 30 2018 3:56 PM

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

హయత్‌నగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న మారుతి కారు హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద అదుపు తప్పి వంతెన గోడను ఢీకొంది.

ఈ ఘటనలో కారులో ఉన్న వరప్రసాద్(50) అనే వ్యక్తి మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న నాగమణి(45), దేవదానం(20)లు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement