16న వికలాంగుల ‘చలో ఢిల్లీ’ | On 16 Disabilities 'Chalo Delhi' | Sakshi
Sakshi News home page

16న వికలాంగుల ‘చలో ఢిల్లీ’

Feb 24 2015 3:46 AM | Updated on Sep 2 2017 9:47 PM

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వికలాంగుల హక్కుల చట్టం - 2013’ బిల్లును ప్రవేశపెట్టి...

హైదరాబాద్ : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వికలాంగుల హక్కుల చట్టం - 2013’ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 16న వికలాంగుల ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తున్నట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిల భారత వికలాంగుల హక్కులవేదిక, హెలెన్‌కెల్లర్ వికలాంగుల ప్రాంతీయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల అధ్యక్షులు నాగేశ్వరరావు, పీవీ రావు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement