క్షుద్రపూజలు చేస్తున్న ఓ వృద్ధుడ్ని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు.
వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారు యాదవ్‌నగర్ కాలనీలో క్షుద్రపూజలు చేస్తున్న ఓ వృద్ధుడ్ని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. నెల్లికుదురు మండలం వావిలాల శివారు తండాకు చెందిన లచ్చిరామ్‌నాయక్ (65) మరికొందరితో కలసి యాదవ్‌నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తుండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. లచ్చిరామ్ నాయక్ దొరకగా, మిగిలిన వారు పరారయ్యారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.