గొలుసు కోసం వృద్ధురాలి హత్య | old age woman killed by thieves in warangal district | Sakshi
Sakshi News home page

గొలుసు కోసం వృద్ధురాలి హత్య

Jun 5 2016 12:24 PM | Updated on Oct 8 2018 5:19 PM

వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది.

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న పద్మావతి(70) అనే వృద్ధురాలిని రెండున్నర తులాల బంగారు గొలుసు కోసం ఆగంతకులు గొంతు నులిమి చంపేశారు. ఒంటరిగా నివసిస్తున్న పద్మావతిని ఆగంతకులు మొదటగా ఇటుక రాయితో తలపై మోదారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు.

చనిపోయిందనుకుని భ్రమపడిన ఆగంతకులు ఆమె మెడలోని గోలుసు తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం ఆమె గొంతులో ప్రాణం ఉండటం గమనించిన స్థానికులు ... మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కాద్దిసేపటకే మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement