తెలంగాణ రాష్ట్రంలో సగం గ్రామాలకు సరైన మంచినీటి సౌకర్యం లేదని గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు మంత్రి తారక రామారావు దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సగం గ్రామాలకు సరైన మంచినీటి సౌకర్యం లేదని గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు మంత్రి తారక రామారావు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో మొత్తం 27,139 గ్రామాలుండగా, అందులో 13,516 గ్రామాలు తాగునీరు సౌకర్యాలు సరిగా లేక అల్లాడుతున్నాయని వివరించారు. 41 శాతం గ్రామాలకు మాత్రమే మంచినీటి సౌకర్యం ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 1,847 ఫ్లోరైడ్ గ్రామాలున్నాయని అధికారులు వివరించగా.. ఈ గ్రామాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.