ఈ సారి కొత్తగా..

New Voting System Arranging VV Pats To EVMs - Sakshi

సాక్షి, దమ్మపేట: ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక సౌకర్యాలను జోడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. అభ్యర్థుల ఫొటోలు ఓటర్లు అభ్యర్థిని గుర్తించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)పై పోటీలో ఉన్న అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు ఈ విధానం లేదు. త్వరలో జరగనున్న ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ విధానాన్ని అమలు చేయనుంది.  
ఓటు సరిచూసుకోవచ్చు 
ఈవీఎంల పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి ఓటర్‌ వెరిఫికేషన్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌)లను వినియోగిస్తున్నారు. దీంతో మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చు. 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌లో కనిపిస్తుంది. 
సీ–విజిల్‌ యాప్‌ 
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి సీ–విజిల్‌ యాప్‌ ఉపయోగపడుతుంది. ఉల్లంఘనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారికి అక్కడ నుంచి ఎన్నికల సంఘానికి పంపవచ్చు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top