తీరనున్న ప‘రేషన్‌’

New Ration Shops For New Gram Panchayats In Medak - Sakshi

పెద్దశంకరంపేట(మెదక్‌) : ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుతో ప్రజలను పలు సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలు కొత్త పంచాయతీల రాకతో తీరేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో కొత్త పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో కొత్త రేషన్‌ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇక కొత్త పంచాయితీల వద్దనే రేషన్‌ సరుకులను ప్రజలు అందుకునే అవకాశం ఉండనుంది. జిల్లాలో ప్రస్తుతం 2,07,643 కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. ఇందులో అంత్యోదయ 13,016, అన్నపూర్ణ 88 కార్డులున్నాయి.  వీరికి ప్రతీ నెల  రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరుకులను అందజేస్తుంది.  

ఇప్పటి వరకు మధిర గ్రామాలతో పాటు గిరిజన తాండాలకు చెందిన ప్రజలు రేషన్‌ సరుకులను పొందాలంటే వారు తప్పని సరిగా ఆటోలు, లేక కాలినడకన కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఈ విషయంపై ఇటీవల చర్చించడంతో పాటు నూతనంగా కొత్త పంచా యతీల్లో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని నిర్ణయిం చింది.  అదిగాక దుకాణా నికి వెళ్లినప్పుడు ఈ – పాస్‌ మిషిన్‌లకు  సిగ్నల్స్‌ సమస్య కూడా లబ్ధిదారులను వేధిస్తుంది. దీంతో ఒక రోజంతా రేషన్‌ సరుకులు తెచ్చుకోవడానికే సమయం వె  చ్చిం చాల్సిన పరి స్థితి. ఇది వరకు జి ల్లా వ్యాప్తం గా 312 పంచాయతీలుండగా కొత్తగా 157 పంచా యతీలు ఏర్పాటయ్యా యి.  పాత పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు ఉండగా ఇప్పుడు 157 కొత్త పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతీ 500 మంది జనాభాకు అనుగుణంగా రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నా గతంలో పట్టించుకున్న పాపనలేదు. పెద్దశంకరంపేట మండలంలో గతంలో ఉన్న 22 పంచాయతీల పరిధిలో 27 రేషన్‌ దుకాణాలున్నాయి. నూతనంగా ఏర్పాటైన 5 పంచాయతీలతో కలిపి మండలంలో 27 పంచాయతీలయ్యాయి. ఆహారభద్రత కార్డుల సంఖ్య 11,034 ఇందులో అంత్యోదయ 764, అన్నపూర్ణ 20.  వీటికి తోడు ఇటీవల వేలాది మంది కొత్తగా ఆహారభద్రత కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిని పరిగణలోనికి తీసుకొని కొత్తగా రేషన్‌ దుకాణాల  ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం
మండలంలో కొత్తగా రేషన్‌ దుకాణాల ఏర్పాటకు గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొత్త పంచాయతీలలో రేషన్‌ దుకాణాల ఏర్పాటుపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు. కొత్త పంచాయతీల్లో రేషన్‌ దుకాణాల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
–నారాయణ, తహసీల్దార్, పెద్దశంకరంపేట

ఇబ్బందులు తొలుగుతాయి..
కొత్తగా ఏర్పాటైన మా పంచాయతీ ఇసుకపాయలతాండాలో రేషన్‌దుకాణం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్‌ తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే రేషన్‌ దుకాణాం ఏర్పాటు  చేయాలి.  
–దీప్‌సింగ్, ఇసుకపాయలతాండా, పెద్దశంకరంపేట 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top